Narendra Modi Letter: అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాశారు. 11 రోజులపాటు ఎంతో కఠిన దీక్షకు ఉన్న ప్రధానిని రాష్ట్రపతి లేఖలో అభినందించారు. ఆ లేఖకు ప్రధాని మోదీ మంగళవారం బదులిచ్చారు. 'మీరు రాసిన లేఖ అందుకునే సమయానికి నా మనసు భావోద్వేగంతో నిండిపోయి ఉంది. దాని నుంచి బయటపడేందుకు మీ లేఖ చాలా దోహదం చేసింది. అయోధ్య పురిలో గడిపిన క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేను. అయోధ్యను నా గుండెల్లో పెట్టుకుని ఢిల్లీకి తిరిగి వచ్చా' అని రాష్ట్రపతికి లేఖలో ప్రధాని బదులు ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నా జీవితంలోని ప్రతి అధ్యాయంలో అందరి ఆదరణ, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, ప్రతి ఒక్కరి కృషికి స్ఫూర్తినిచ్చినది రాముడే. రాముని శాశ్వతమైన ఆలోచనలు మన దేశ ఉజ్వల భవిష్యత్‌కు ఆధారం. ఈ ఆలోచనల శక్తి 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తయారుచేయడానికి మన దేశ ప్రజలందరికీ మార్గం సుగమం చేస్తుంది. అయోధ్య గొప్ప ఆలయం మనకు విజయం, అభివృద్ధి వైపు మార్గనిర్దేశం చేస్తుంది' అని లేఖలో ప్రధాని మోదీ తెలిపారు.
 



రెండు రోజుల కిందట రాసిన లేఖలో ప్రధాని మోదీపై రాష్ట్రపతి ముర్ము అభినందనలు తెలిపారు. 'సాహసం, కరుణ, కర్తవ్య నిష్టకు రాముడు ప్రతీక. సుపరిపాలన అంటే ఇప్పటికీ రామరాజ్యమే గుర్తొస్తుంది. సత్యనిష్ట గొప్పతనాన్ని రాముడి వల్లే గ్రహించా. జాతి నిర్మాతలకు రామాయణం ప్రేరణగా నిలిచింది. పీఎం జన్‌మన్‌ ద్వారా గిరిజనుల అభివృద్ధికి మీరు చేసిన కృషి అభినందనీయం. గిరిజన సమాజంతో అనుబంధం కలిగి ఉన్న మీకంటే దీన్ని ఎవరూ బాగా అర్థం చేసుకుంటారు. మన సంస్కృతి ఎల్లప్పుడూ.. సమాజంలోని అత్యంత అణగారిన వర్గం కోసం పని చేయడం మీకు నేర్పింది. పీఎం జన్‌మన్‌ నేడు దేశ ప్రజల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకువస్తున్నాయి' అని రాష్ట్రపతి తెలిపారు.

Also Read: Parliament Elections: బర్రెలక్క మరో సంచలనం.. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీకి సై?

Also Read: Bharat Ratna: కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న పురస్కారం.. అసలు ఆయన ఎవరో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook